- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: పదవి పోయాక పుతిన్ కు ట్రంప్ సీక్రెట్ కాల్స్..!
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ప్రపంచం దృష్టి ఉంది. కాగా.. ఇలాంటి టైంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి సంచలన విషయం బయటకొచ్చింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో రహస్యంగా ఫోన్‌లో సంభాషణలు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. అమెరికా జర్నలిస్ట్ బాబ్ వుడ్‌వర్డ్ రాసిన "వార్" అనే పుస్తకం ఈనెల 15వ తేదీన విడుదల కానుంది. కాగా.. ఆ బుక్ లోని కొన్ని విషయాలు స్థానిక మీడియాలో ప్రసారం అవుతున్నాయి. పదవి పోయిన తర్వాత ట్రంప్, పుతిన్ రహస్యంగా ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు ఆ పుస్తకంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ప్రారంభం అయిన తర్వాత కూడా ఈ ఏడాది మొదట్లో ట్రంప్.. తన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి పుతిన్‌తో అత్యంత రహస్యంగా ఫోన్‌లో మాట్లాడినట్లు బుక్ లో పేర్కొన్నారు. అప్పుడు తన రూమ్‌లో ఎవరూ ఉండొద్దని తన భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిని ట్రంప్ బయటికి పంపించినట్లు తెలిపారు. 2021లో అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయిన నాటి నుంచి పుతిన్‌తో కనీసం 7 సార్లు రహస్యంగా ఫోన్ మాట్లాడినట్లు బాబ్ వుడ్‌వర్డ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
సీక్రెట్ గా కరోనా కిట్ల పంపిణీ
అంతేకాకుండా కరోనా సమయంలోనూ పుతిన్‌కు ట్రంప్ రహస్యంగా కొవిడ్ టెస్టింగ్ కిట్‌లు కూడా పంపించినట్లు తెలుస్తోంది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూసిన కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాల్లో టెస్టింగ్ కిట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అయితే ఆ సమయంలో పుతిన్ కోసం కొన్ని కొవిడ్ కేర్ టెస్ట్ కిట్లను ట్రంప్ బహుమతిగా పంపించినట్లు వుడ్ వర్డ్ బుక్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలంటూ ట్రంప్‌ను పుతిన్ కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటికి వస్తే ఇబ్బందులు వస్తాయని పుతిన్ చెప్పినట్లు వుడ్ వర్డ్ తన పుస్తకంలో ప్రస్తావించారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ విషయాలు బయటికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.