- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుతిన్‌కు అభినందనలు తెలిపిన చైనా..అందుకోసమేనా?
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో పుతిన్‌కు చైనా అభినందనలు తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడాలని పేర్కొంది. ‘సోవియట్ యూనియన్ అనంతరం పుతిన్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. పాశ్చాత్య దేశాలకు ధీటుగా నిలబడి తమ దళాలను ఉక్రెయిన్‌లోకి పంపాడు. అధికారంపైనా గట్టిపట్టును సాధించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల ఆధ్వర్యంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడాలని ఆశిస్తున్నాం’ అని డ్రాగన్ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. చైనా రష్యాలు ఎంతో కాలంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా పై ఆంక్షలు విధించి తీవ్రంగా విమర్శలు చేసినప్పటికీ చైనా మాత్రం రష్యాతో తన సంబంధాలను మరింత విస్తరించుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించే ముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు. మరోవైపు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.