ఏడేళ్ల వ‌య‌సులో టీచ‌ర్ అలా చేసింద‌ని 30 ఏళ్ల తర్వాత 101 సార్లు కత్తితో పొడిచి..!

by Sumithra |
ఏడేళ్ల వ‌య‌సులో టీచ‌ర్ అలా చేసింద‌ని 30 ఏళ్ల తర్వాత 101 సార్లు కత్తితో పొడిచి..!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఏ మ‌నిషి పుట్టుక‌తో నేర‌స్థుడు కాడు. కొన్ని మాన‌సిక ఒత్తిడిలు, కొన్ని సాంఘీక కార‌ణాలు మ‌నిషిని మాన‌వ‌త్వానికి దూరం చేస్తాయి. పుట్టుక‌తో లేని కోపం, ద్వేషం, ప‌గ పెరిగే వ‌య‌సులో నేర్చుకునే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. త‌ద్వారా, మ‌నిషి ఎలాగైనా మారొచ్చు. ఈ సంఘ‌ట‌న‌లోనూ అదే జ‌రిగింది. ప్రైమరీ స్కూల్‌లో తనని టీచర్‌ కించపరిచింద‌ని భావించిన 37 ఏళ్ల వ్యక్తి, మూడు దశాబ్దాల తర్వాత 2020లో ఆ టీచ‌ర్‌ని కత్తితో పొడిచి చంపిన ఘ‌ట‌న బెల్జియంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే, గుంటెర్ ఉవెంట్స్ అనే వ్య‌క్తి 1990 సంవ‌త్స‌రం ప్రారంభంలో, ఏడేళ్ల వయస్సులో విద్యార్థిగా ఉన్నపుడు, స్కూల్ టీచ‌ర్‌ మారియా వెర్లిండెన్ తన ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించింద‌ని, జీవితంలో ఎవ్వ‌రూ న‌న్న‌లా చూడ‌లేద‌ని కోర్టులో వెల్ల‌డించాడు. తాను బాధపడ్డానని ఆ బాధ‌ను 31 ఏళ్లు మ‌న‌సులో దాచుకున్న‌ట్లు చెప్పాడు. ఇక‌, 2020లో ఆంట్‌వెర్ప్ సమీపంలోని హెరెంటల్స్ ప్రాంతంలో ఉన్న‌ 59 ఏళ్ల వెర్లిండెన్ ఇంటికి వెళ్లి, అక్క‌డ వంట గ‌దిలో ఆమెను అతి క్రూరంగా హత్య చేశాడు.

అయితే, ఈ కేసులో మొద‌ట ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదు. బెల్జియన్ పోలీసుల విచారణలో వందలాది డీఎన్ఏ నమూనాలు ప‌రిశీలించిన‌ప్ప‌టికీ హంత‌కుడెవ‌రో అర్థం కాలేదు. మృతదేహం పక్కనే డైనింగ్ టేబుల్‌పైన డ‌బ్బులున్న‌ ఆమె ప‌ర్సును తాకకుండా ఉండ‌టాన్ని చూసి, ఈ హ‌త్య దోపిడీకి సంబంధించింది కాద‌ని పోలీసులు నిర్థారించుకున్నారు. కానీ, హ‌త్య ఎందుకుచేశారో తెలియ‌లేదు. ఎవ‌రైనా సాక్షులుంటే ముందుకు రావాల‌ని ఆమె భర్త బహిరంగగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేశాడు. నవంబర్ 20, 2020 న జ‌రిగిన‌ హత్యను పదహారు నెలల తర్వాత, హంత‌కుడు ఉవెంట్స్ తన స్నేహితుడికి చెప్ప‌డంతో, విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చింది. స్నేహితుడి ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే నేర‌స్థుణ్ణి అరెస్ట్ చేశారు. మీడియా కథనాల ప్రకారం ఉవెంట్స్ త‌న చిన్న‌నాటి స్కూల్ టీచ‌ర్‌ను 101 సార్లు కత్తితో పొడిచి, చంపాడు.

స్థానిక మీడియా ప్రకారం, ఉవెంట్స్ డిటెక్టివ్‌లతో మాట్లాడుతూ, స్కూల్లో ఉన్న‌ప్పుడు తోటి విద్యార్థులు త‌న‌ను వెక్కిరించే వార‌నీ, వేధించార‌ని, అవమానించార‌ని, త‌న‌ని తక్కువచేసి చూసేవార‌ని అన్నాడు. ఆ స‌మ‌యంలో త‌న బాధ‌ను టీచ‌ర్ పట్టించుకోలేద‌ని చెప్పాడు. ఇక‌, క్లాస్‌లో ఏదైనా ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల‌ని "నేను చేయి పైకెత్తితే, ఆమె ఎప్పుడూ మ‌రొక‌ర్ని సమాధానం చెప్పమని అడిగేది. అది నాకు చాలా బాధ‌, అసంతృప్తి క‌లిగించేది" అని ఉవెంట్స్ కోర్టు ఎదుట వివ‌రించాడు. అయ‌తే, తాను టీచ‌ర్ ఇంటికి మంచిగా మాట్లాడ‌టానికే వెళ్లాన‌ని, అప్పుడు కూడా ఆమె తన‌ని చూసి నవ్వి, "నువ్వొక మూర్ఖుడివి, స‌మాజంలో ఎలా ఉండాలో నీకు తెలియ‌దు" అని త‌న బాధ‌ను కొట్టిపారేసినట్లు ఉవెంట్స్ పేర్కొన్నాడు. అంతేకాదు, తాను ఇంటికి కత్తి తీసుకురాలేదని చెప్పాడు. అయితే, హ‌త్య‌కు ఉప‌యోగించిన ఆయుధాన్ని పోలీసులు ఇంకా క‌నుక్కోలేదు. ప్ర‌స్తుతం ఉవెంట్స్‌ను హ‌త్యా నేరం కింద క‌స్ట‌డీలో ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed