రోడ్డుకు 'బ‌ర్త్‌డే పార్టీ', ఇంత‌కీ ఏంటీ వెట‌కారం..?!!

by Sumithra |   ( Updated:2022-03-17 12:14:25.0  )
రోడ్డుకు బ‌ర్త్‌డే పార్టీ, ఇంత‌కీ ఏంటీ వెట‌కారం..?!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కోపం క‌ట్ట‌లు దాటినా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే ఏడుపొచ్చి, ఆన‌క న‌వ్వు కూడా వ‌స్తుంది. త‌ర్వాత వెట‌కారంగా మారి సెటైర్లు వేయ‌డానికి ప‌నికొస్తుంది. ముఖ్యంగా ఈ ప‌రిణామం ప‌బ్లిక్ డొమైన్‌లో మ‌రింత క‌నిపిస్తుంది. స‌రిగ్గా ఓ బ్రిటీష్ న‌గరంలోనూ ఇలాంటి సంద‌ర్భ‌మే చోటు చేసుకుంది. త‌మ ప్రాంతంలో రెండేళ్ల క్రితం ప్రారంభించి, ఇంకా పూర్తిచేయ‌ని రోడ్డుకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆ రోడ్డుపైన ఉన్న ఓ పెద్ద గోతికి పుట్టిన‌రోజు నిర్వ‌హించారు.

స్విన్డ‌న్ అనే ప్రాంతంలో మీడ్‌ వే రోడ్డు పనులు ప్రారంభించి రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటికీ 'బస్టాప్‌లు పక్కకు క్రాసింగ్‌లు మూసేసి ఉండ‌టం, స‌గం పూర్త‌య్యి క‌ద‌ల‌ని పేవ్‌మెంట్‌లు, అంతులేని జాప్యాలతో ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. రోడ్డుపైన అటు నుండి ఇటు రావ‌డానికి మిడ్‌ లేబుల్ కూడా దాట‌లేని ప‌రిస్థితి ఉందని స్థానికులు ఫిర్యాదులు చేశారు. అంతేనా, ఉన్న స్థితిలో రోడ్డు దాట‌డానికి క్యూ లైన్లో నిల‌బ‌డాల్సి ఉంది. ఇక దీనితో ఇప్ప‌టికే విసిగిపోయి, పిచ్చి కోపం వ‌చ్చినా చేసేది లేక‌, స్థానికులు ఈ సంద‌ర్భాన్ని వ్య‌గ్యంగా మార్చారు. అప్ప‌టికైనా అధికారుల్లో క‌దిలిక వ‌స్తుంద‌ని, సమస్య అర్థ‌మ‌య్యి ప‌నులు ప్రారంభిస్తార‌ని అనుకున్నారు. దాని కోసం వెస్ట్ స్విన్డ‌న్ కౌన్సిలర్ జిమ్ రాబిన్స్ ఆధ్వ‌ర్యంలో ఒక‌ కేక్, బ‌ర్త్‌డే బ్యానర్ పెట్టి, వ్యంగ్యంగా, నవ్వుతూ పార్టీ చేసి, చప్పట్లు కొట్టారు.

యూర‌ప్‌లోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే, భార‌తదేశంలో, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో రోడ్లకు ఎన్ని బ‌ర్త్‌డేలు చేయాలో, ఎన్ని కేకులు కోయాలో..?!!

Advertisement

Next Story