- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్రసముద్రంలో హౌతీలను తప్పించుకునేందుకు ‘చైనా’ మార్కు!
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా, బ్రిటన్‌లతో కూడిన సైనిక కూటమి ఎర్ర సముద్రం తీరంలోని యెమన్ హౌతీ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దీంతో హౌతీలు కూడా రెచ్చిపోతున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతున్న దేశాల యుద్ధనౌకలపై దాడులను ముమ్మరం చేస్తున్నారు. ఎర్రసముద్రం మీదుగా వెళ్లే ప్రతీ నౌకను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్ వైపు వెళ్లేందుకు యత్నించే నౌకలను అస్సలు వదలడం లేదు. కేవలం చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ నౌకలను మాత్రం వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో యెమన్ హౌతీల బారి నుంచి తప్పించుకోవడానికి కొన్ని నౌకాయాన కంపెనీలు చైనా జెండాలను వాడుకుంటున్నాయి. అంతేకాదు తమ నౌకలలోని ప్రతీ సిబ్బంది చైనీయుడే ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. హౌతీలు ఒకవేళ నౌకల తనిఖీ కోసం వచ్చినా.. అందరూ చైనీయులే కనిపిస్తే వెనక్కి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఫార్ములాను కాపీ కొట్టేందుకు చాలా నౌకాయాన కంపెనీలు యత్నిస్తున్నాయట. తమ నౌకలకు చైనాతో సంబంధాలు ఉన్నాయనే సంకేతాలను ఇవ్వడం ద్వారా హౌతీల డేంజర్ సిగ్నల్‌ను దాటేయొచ్చని కొన్ని షిప్పింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఆపేంత వరకు ఎర్ర సముద్రంలో తమ ఎమర్జెన్సీని కొనసాగిస్తామని హౌతీలు తేల్చి చెబుతున్నారు.