Amazon Rainforest: అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు.. బ్రెజిల్ కు కరువైన ఊపిరి

by Rani Yarlagadda |
Amazon Rainforest: అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు.. బ్రెజిల్ కు కరువైన ఊపిరి
X

దిశ, వెబ్ డెస్క్: అమెజాన్ అడవుల్లో రేగిన కార్చిచ్చు కారణంగా.. బ్రెజిల్ పొగ దుప్పటి కప్పుకుంది. 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమెజాన్ అడవులు కార్చిచ్చులో దగ్ధమయ్యాయి. కొన్నిరోజులుగా రగులుతున్న మంటల్లో 80 శాతం అడవులు, వ్యవసాయ భూములు కాలి బూడిదయ్యాయి. బ్రెజిల్ ను దట్టమైన పొగ అలుముకోవడంతో.. కరోనా సమయంలో వాడిన మాస్కులను ఇప్పుడు వాడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయిందని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. అర్జెంటీనా, బ్రెజిల్, బొలీవియా, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, పెరూ దేశాల్లో లక్షల్లో వ్యవసాయ భూమి కార్చిచ్చులో బూడిదైంది.

భూమిపై అతి చల్లనైన ప్రదేశాల్లో ఒకటైన అమెజాన్ అడవుల్లో ఈ స్థాయిలో కార్చిర్చు రగలడం అక్కడి వారిని భయాందోళనకు గురిచేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INPE) గత వారం చిత్రీకరించిన శాటిలైట్ చిత్రాల్లో 80 శాతం బ్రెజిల్ ప్రాంతం తీవ్రమైన పొగ అలుముకుని ఉన్నట్లు కనిపించింది. ఒక వ్యక్తి రోజుకి 4-5 సిగరెట్లను కాల్చితే ఎంత పొగ పీలుస్తాడో.. ఈ కార్చిచ్చుతో ప్రతి వ్యక్తి అంత పొగతో కూడిన గాలిని పీలుస్తున్నాడని నిపుణులు తెలిపారు. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందన్నారు. బ్రెసిలియాలోని పేరొందిన ఒక ఆస్పత్రిలో సాధారణంగా వచ్చే పేషంట్లకంటే 20 రెట్లు పేషంట్లు అధికంగా వస్తున్నారని ఆ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed