Ajit Doval: ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి.. బ్రిక్స్ ఎన్‌ఎస్‌ఏల సదస్సులో అజిత్ దోవల్

by vinod kumar |
Ajit Doval: ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి.. బ్రిక్స్ ఎన్‌ఎస్‌ఏల సదస్సులో అజిత్ దోవల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదం, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బెదిరింపులు వంటి ఆధునిక భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సహకరించాలని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ బ్రిక్స్ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బుధవారం జరిగిన బ్రిక్స్ దేశాల ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో దోవల్ ప్రసంగించారు. రోజురోజుకూ పెరుగుతున్న తీవ్రవాద సమస్యను పరిష్కరించడానికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని నొక్కి చెప్పారు. ఐక్యంగా ఉంటే ఏ సవాళ్లనైనా ఎదుర్కోగలమని స్పష్టం చేశారు. సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ప్రపంచంలోని భద్రతా సవాళ్లను కూడా సమీక్షించారు. అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో దోవల్ భేటీ అయ్యారు. భారత్-చైనా సంబంధాలు, ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చించేందుకు వీరిద్దరూ గురువారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, బ్రిక్స్ వార్షిక సమావేశం వచ్చే నెల 22 నుంచి అక్టోబర్ 24 వరకు మాస్కోలో జరిగనుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సహా బ్రిక్స్ దేశాల నేతలు పాల్గొననున్నారు.

Advertisement

Next Story