కాల్పుల విరమణకు అంగీకరించండి: హమాస్‌కు బైడెన్ సూచన

by samatah |
కాల్పుల విరమణకు అంగీకరించండి: హమాస్‌కు బైడెన్ సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నాటికి గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హమాస్‌కు పిలుపునిచ్చారు. గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడిందని కాల్పుల విరమణ తప్పకుండా జరగాలని సూచించారు. వచ్చే వారం ప్రారంభమయ్యే రంజాన్ నాటికి ఈ ఒప్పందం పూర్తి కావాలని తెలిపారు. రంజాన్‌లో సంఘర్షణను కొనసాగించడం ఇజ్రాయెల్‌కు చాలా ప్రమాదకరం కాబట్టి, ప్రారంభానికి ముందే ఈ ఒప్పందానికి అంగీకరించాలని స్పష్టం చేశారు. కాగా, రంజాన్ సందర్భంగా జెరూసలేంలోని అల్-అక్సా మసీదు ప్రాంగణంలోకి ముస్లింలను అనుమతించాలని అమెరికా గతంలో ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే సంధి, బందీల విడుదల కోసం చర్చలు నిరవధికంగా కొనసాగలేవని హమాస్ హెచ్చరించింది. హమాస్, యూఎస్ ఆరు వారాల సంధిపై చర్చల కోసం కైరోలో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తులతో సమావేశమయ్యాయి. చర్చల్లో బందీల విడుదల, గాజాకు మానవతా సాయం వంటివి ఉన్నాయి. బుధవారం వరుసగా నాలుగో రోజు కూడా చర్చలు కొనసాగినట్టు తెలుస్తోంది. మరోవైపుఈజిప్ట్, ఫ్రాన్స్‌లతో సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా యూఎస్, జోర్డాన్ విమానాలు గాజాలో మరోసారి ఆహార ప్యాకెట్లను అందించాయి.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story