నైజీరియా యువకుడి అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. దానిని తలపై పెట్టుకుని..

by Shiva |
నైజీరియా యువకుడి అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. దానిని తలపై పెట్టుకుని..
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఫుట్‌బాల్‌ను మనం అరచేత బ్యాలెన్స్ చేయాలంటేనే కిందా, మీదా పడతాం. అలాంటిది ఓ నైజీరియా యువకుడు అరుదైన ఫీట్ సాధించి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. వివరాల్లోకి వెళితే.. టోనీ సోలమన్ కు చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేది. అందేంటంటే.. ఎవ్వరూ సాహసం చేయని పనులు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అతడు ఏకంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు.

తన తలపై ఫుట్‌బాల్‌ను చేతులతో పట్టుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ.. 10 అడుగులు, 20 అడుగులు కాదు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 250 అడుగుల రేడియో టవర్ ను అధిరోహించాడు. ఈ ఫీట్ తో సోలమన్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాడు. అందుకు సంబంధించిన వీడియో ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాలో 'ఈ రికార్డు కోసం పర్వతారోహకుడు టోనీ సోలమన్ రెండు నెలల కఠోర సాధన చేశాడు. అతడి సాహసం ఇతరులకు స్ఫూర్తిదాయకం' అంటూ ట్వీట్ చేసింది.



Next Story