- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన చిన్నారుల కోసం వాటితో అలాంటి ప్రదర్శన..?! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః యుద్ధం నాశనాన్నే మిగిల్చుతుందన్నది చారిత్రక సత్యం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ నుండి లక్షల మంది శరణార్థులుగా మారారు. అందులో సగం మంది చిన్నపిల్లల ఉన్నారు. అంతకుమించి, ముక్కపచ్చలారని చిన్నారులు యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోయారు. అందుకే, రష్యా ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా, ఉక్రెయిన్‌లో మరణించిన పిల్లల జ్ఞాపకార్థం శుక్రవారం వివ్ నగరంలోని సెంట్రల్ స్క్వేర్‌లో చిన్నారులు పడుకునే ఖాళీ స్ట్రోలర్లు ప్రదర్శిస్తూ, నిరసన తెలిపారు.
ఇందులో భాగంగా, వీవ్ సిటీ హాల్ ప్రాంగణంలో 109 స్ట్రోలర్స్, ప్రామ్‌లను వరుసగా ఉంచారు. ఇవి యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చనిపోయిన ప్రతి బిడ్డకు గుర్తుగా ఏర్పాటుచేశారు. "మీ పిల్లల్ని ఇలాంటి స్ట్రోలర్స్‌లో కూర్చోబెట్టినప్పుడు చనిపోయిన ఉక్రెయిన్ పిల్లల్ని గుర్తుంచుకోండి" అని రష్యాలోని తల్లులను ఉద్దేశించి ఓ బోర్డును కూడా పెట్టారు. ఉక్రేనియన్ మూలాలున్న కెనడా పౌరురాలు జురావ్కా నటాలియా టోన్‌కోవిట్ ఈ మాటలు చెబుతున్నట్లు ఆ బోర్డులో ప్రదర్శించారు. ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమానికి మీడియాలో మంచి స్పందన వస్తోంది.