- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖాతా తెరిచిన విండీస్
దిశ, స్పోర్ట్స్: రైజ్ ద బ్యాట్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై విండీస్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఖాతా తెరిచింది. టెస్టు చాంపియన్‌షిప్ ప్రారంభమైన ఏడాది తర్వాత కానీ ఒక విజయాన్ని నమోదు చేయగలిగింది. ఈ గెలుపుతో విండీస్ ఖాతాలో 40 పాయింట్లు చేరాయి. ప్రతి టెస్టు సిరీస్‌లో 120 పాయింట్లు ఉంటాయి. మ్యాచ్‌ల సంఖ్యను బట్టి గెలిస్తే వచ్చే పాయింట్లు ఉంటాయి. ఇది మూడు మ్యాచ్‌ల సిరీస్ కాబట్టి గెలిస్తే 40, డ్రా అయితే 20 చొప్పున పాయింట్లు ఆయా జట్లకు కలుపుతారు. 2019, ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన ఈ టెస్టు చాంపియన్‌షిప్ వచ్చే ఏడాదిలో జూన్‌లో ముగుస్తుంది. అప్పటికి టేబుల్ టాపర్‌లుగా ఉన్న రెండు జట్లు లార్డ్స్‌లో ఫైనల్ టెస్ట్ ఆడతాయి. ఇక నిన్నటి మ్యాచ్ తర్వాత ఐసీసీ ప్రకటించిన టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లలో భారత జట్టు అగ్రస్థానంలో నిలబెట్టుకుంది. చివరి స్థానంలో ఉన్న విండీస్ 7వ స్థానానికి ఎగబాకింది.
పాయింట్ల పట్టిక
స్థానం | జట్టు | పాయింట్లు |
1 | ఇండియా | 360 |
2 | ఆస్ట్రేలియా | 296 |
3 | న్యూజిలాండ్ | 180 |
4 | ఇంగ్లండ్ | 146 |
5 | పాకిస్తాన్ | 140 |
6 | శ్రీలంక | 80 |
7 | వెస్టిండీస్ | 40 |
8 | సౌతాఫ్రికా | 24 |
9 | బంగ్లాదేశ్ | 0 |