ఆయనతో నటించడం చాలా ఈజీ.. నిత్యామీనన్

by Shyam |
Nithya Menon, pawan kalyan
X

దిశ, సినిమా : టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్.. ‘భీమ్లా నాయక్‌’ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తను పవన్‌ భార్యగా నటిస్తోంది. అయితే మేకర్స్ ఇప్పటివరకు సినిమాలో నిత్యా మీనన్‌కు సంబంధించి ఎటువంటి గ్లింప్స్ రిలీజ్ చేయనప్పటికీ.. పవన్‌-నిత్య కాంబినేషన్‌లో ఓ సాంగ్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే, పవన్‌తో మొదటిసారి నటించిన నిత్య.. ఆయనతో షూటింగ్ చేయడం ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పింది.

ఒరిజినల్ మూవీ కన్నా ‘భీమ్లా నాయక్‌’లో తన పాత్ర డిఫరెంట్‌గా తీర్చిదిద్దారని, భర్తను ఆజ్ఞాపించే బలమైన పాత్ర అని చెప్పుకొచ్చింది. అంతేకాదు పవన్ కళ్యాణ్‌తో పని చేయడం చాలా ఈజీ అని తెలిపింది. మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’కు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Next Story

Most Viewed