congress: జగదీశ్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్.. కాంగ్రెస్ చాలెంజ్

by Prasad Jukanti |   ( Updated:2025-03-14 11:09:12.0  )
congress: జగదీశ్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్.. కాంగ్రెస్ చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి (Jagdish Reddy) ఇంకా అహంకారం తగ్గలేదని టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి (Patel Ramesh Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని అంటున్న జగదీశ్ రెడ్డి.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఈసారి కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సభలో మీరు చేసింది కరెక్టో లేక మేము చేసింది కరెక్టో ప్రజల వద్దే తేల్చుకుందామన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో (Gandhi Bhavan) మీడియాతో మాట్లాడిన పటేల్ రమేశ్ రెడ్డి.. జగదీశ్ రెడ్డి చేసే చౌకబారు పనులను ఎవరూ మెచ్చరన్నారు. సభలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ (BRS) నాయకులను హెచ్చరిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.

ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి?:

ఆనాడు రబ్బర్ చెప్పులు, డొక్కు స్కూటర్ మీద తిరిగిన జగదీశ్ రెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మంత్రిగా ఓ నియంతలా వ్యవహరించి వేల కోట్లు సంపాదించుకున్న చరిత్ర జగదీశ్ రెడ్డిది అన్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ 12 సీట్లకు 11 ఓడిపోయింది. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్క సీటు గెలిచావ్. ఇంకా మీరే అధికారంలో ఉన్నామనే అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలకే కాకుండా పూర్తి కాలం సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed