అప్పుడే వేస్తున్న శ్లాబ్ కూలి.. కూలీలకు తీవ్ర గాయాలు

by Shyam |
అప్పుడే వేస్తున్న శ్లాబ్ కూలి.. కూలీలకు తీవ్ర గాయాలు
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వీవీఐపీల వసతి కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్లలోని ఓ భవనానికి శ్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ కుప్పకూలింది. శ్లాబ్ మీద పనిచేస్తున్న కూలీలు పై నుంచి కింద పడటంతో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఇద్దరు కూలీల తలకు తీవ్రగాయాలై రక్తస్రావం ఎక్కువ అవుతుండటంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రక్షణ కవచాలు లేకపోవడం

పని చేస్తున్న సందర్భంలో కార్మికులకు హెల్మెట్లు సహా రక్షణ కవచాలు లేకపోవడంతో తలలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు మహబూబ్​నగర్​కు చెందిన చెన్నయ్య, వెంకటస్వామి, శ్రీకాకుళం వాసి అప్పన్, తాండూరు వాసి రాములుగా అధికారులు గుర్తించారు. అందులో అప్పన్న, చెన్నయ్య తలకు తీవ్రగాయాలై ఆస్పత్రికి తరలించారు.

పరిశీలించిన ఆర్​అండ్​బీ

విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ అధికారులు సెంట్రింగ్ కూలిన బిల్డింగ్​ను పరిశీలించారు. పని చేస్తున్న కూలీలకు సరైన అవగాహన లేకపోవడం వల్లే జరిగిందన్నారు. లాక్​డౌన్ కారణంగా అంతకుముందు పని చేస్తున్న కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో కాంట్రాక్టర్ కొత్తవారితో పనులు చేయించడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి రక్షణ కవచాలు లేవు. కనీసం తలకు పెట్టుకునే హెల్మెట్లు కూడా కూలీలకు ఇవ్వకపోవడంతోనే కూలీల తలకు గాయాలయ్యాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed