ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న మహిళలు.. పలువురు రైతులు ఫైర్

by Shyam |   ( Updated:2021-11-17 04:01:56.0  )
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న మహిళలు.. పలువురు రైతులు ఫైర్
X

దిశ, పరకాల: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మహిళా సంఘాల సభ్యులు అడ్డుకున్న సంఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ రోజు పీఎసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తుండగా గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు జరుపుతున్నామని ఈసారి కూడా ధాన్యం కొనుగోలుపై ఆర్డర్ కాపీ రావడం జరిగిందన్నారు. కానీ అందుకు భిన్నంగా ఎలాంటి సమాచారం లేకుండా పీఎసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సరైంది కాదంటూ, ప్రారంభానికి వచ్చిన నాయకులతో వాగ్వాదానికి దిగారు.

దీంతో గ్రామానికి చెందిన పలువురు రైతులు ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం మూలంగా పోయిన సీజన్‌లో నానా ఇబ్బందులు పడ్డామని, మద్యం తాగించి మూడు పులు ముట్ట చెప్పిన వాళ్ళకే సకాలంలో కాంటాలు నిర్వహించారని మహిళలను నిలదీశారు. గ్రామ సర్పంచ్ ఊర రవీందర్ రావు కల్పించుకొని పీఎసీఎస్ డైరెక్టర్ సతీష్ రావు, మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి ఇరువురి మధ్య ఏమైనా సమస్యలు ఉంటే ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని ఇరువర్గాలను సమన్వయపరిచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గణపతి రెడ్డి, ఎంపీటీసీ అప్పం చేరాలు, పీఎసీఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed