భర్త కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

by Sridhar Babu |   ( Updated:2021-05-29 11:12:09.0  )
భర్త కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ
X

దిశ, హుజురాబాద్ : తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. ఈఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. పెసరి సరస్వతి అనే మహిళ తన భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. తనకు న్యాయం చేయాలని వ్యాటర్ ఎక్కి నిరసన తెలిపింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై మధుకర్ రెడ్డి అక్కడకు చేరుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో ఆమె ఆందోళన విరమించి వాటర్ ట్యాంక్ దిగి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story