- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాన్స్‌కోలో ఎలక్ట్రీషియన్ గా మహిళా శక్తి ..
దిశ,బెల్లంపల్లి: నింగిలోకి ధైర్యంగా దూసుకెళ్తున్నా ఇంకా పలు రంగాల్లో మహిళలకు ప్రవేశం లేదు. విద్యుత్తు రంగంలో స్తంభాలు, టవర్లు ఎక్కి మరమ్మతులు చేయడం మీ వల్ల కాదంటూ ఇన్నాళ్లుగా ఆ పోస్టులకు వారిని దూరం పెట్టడం ఆనవాయితీ గా మారింది. అయితే ఆ మాటలకు ఇక చెల్లు చీటి పడినట్టు అయింది. ట్రాన్స్‌కో 2017లో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల్లో తొలిసారి మహిళలకు అవకాశం కల్పించడం తో బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన దుర్గం రజిత ఐటీఐ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగాన్ని సాధించిన నియామక పత్రం అందుకోవడం జరిగింది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎత్తైన విద్యుత్తు టవర్లను సునాయాసంగా ఎక్కి తుది పరీక్షలో పలువురు ఎంపికయ్యారు.
కోర్టు కేసులతో మూడేళ్ల కాలయాపన జరిగినా, ఎదురుచూపులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. దసరా కానుకగా ట్రాన్స్‌కో అధి కారులు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశారు. మొత్తం 650 మందిలో 150 మందికి పైగా మహిళలే ఉన్నారని ట్రాన్స్‌కో డైరెక్టర్ తెలిపారు. సంస్థలో ఇప్పటి వరకు లైన్ ఉమెన్‌లు లేరని తెలంగాణ వచ్చాక ఒకేసారి పెద్ద ఎత్తున నియామకం చేపట్టామని తెలిపారు. ఎంపికైన ఎలక్ట్రిషన్ లైను ఉమెన్ భర్త ప్రైవేటు ఉద్యోగి కాగా ఆమెకు కుమారుడితో పాటు కూతురు ఉన్నారు. ఐటీఐ ఎలక్ట్రికల్ 2017 లో పూర్తిచేశారు. భర్త తోడ్పాటుతో ఊళ్లోనే వ్యవసాయ కరెంట్ పనులు చేస్తూ, స్తంభాలు ఎక్కడం నేర్చుకుని లైన్ ఉమెన్ పోస్టుకు ఎంపికయ్యారు.