- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రేమ పెళ్లి… వివాహిత దారుణ హత్య
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యర్రబాలెం గ్రామ పంచాయతి పరిధిలోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన గురవయ్య కుమార్తె కిన్నెర వెంకటలక్ష్మి(19) అదే కాలనీకి చెందిన యాకయ్యలు గత మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
కాగా వెంకట లక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున తమ నివాస గృహం సమీపంలో నిర్జీవంగా పడి ఉంది. స్థానికులుగమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. మృతురాలు వెంకటలక్ష్మి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఎవరో తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. రూరల్ సీఐ శేషగిరిరావు.. వెంకటలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.