- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నుంచి కోలుకున్న మహిళ.. ఏం చేసిందో తెలుసా..?
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: కరోనా సోకిందంటే చాలు ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రాణం పోసే ఆక్సిజన్ దొరకక కొందరు, వైద్య సేవలు సకాలంలో అందక మరి కొందరు ప్రాణాలు వదులుతున్నారు. వీరికితోడు వైరస్ సోకిందన్న మనస్థాపం, ఆర్థిక, కుటుంబ పరిస్థితులతో మరి కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. మహానగరంలో చికిత్స కోసం పలు ఆసుపత్రులకు తిరిగింది. ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఉండటం, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు ఆస్పత్రల్లో పేషెంట్ల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో దిక్కుతోచనిస్థితిలో ఆ కుటుంబం ఉండి పోయింది. ఇదే సమయంలో జోగులాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో వసతులు, వైద్య సేవలు, ఆక్సిజన్ సైతం పుష్కలంగా ఉందని తెలుసుకొని దూరం అయినా పర్వాలేదు అని నిర్ణయానికొచ్చి ఇక్కడే అడ్మిట్ అయ్యారు.
ఏడు రోజుల పాటు గద్వా్ల్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్య చికిత్స అనంతరం చివరకు కరోనా నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. దీనికితోడు ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. దీంతో వైద్య సిబ్బంది తన ప్రాణాలు కాపాడారని.. వారెప్పుడు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆస్పత్రి ఆవరణలో మొక్క నాటి ధన్యవాదాలు తెలియజేశారు.