- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నల్లమల ఫారెస్ట్‌లో మహిళ కిడ్నాప్.. గాలిస్తున్న పోలీసులు

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలోని పురుగులగుట్ట వెనుక ప్రాంతంలోని అటవీ లోపలికి ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు ఒక మహిళను తీసుకెళుతున్నారు. ఆటోలో ఉన్న మహిళ గట్టిగా అరుస్తూ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ఒక మహిళ గమనించి, గ్రామంలోని అంబేద్కర్ కాలనీ వాసులకు విషయాన్ని తెలిపింది. దీంతో మీడియా మిత్రులు ద్వారా అమ్రాబాద్ సీఐ బీసీ బిసన్నకు సమాచారం అందించడంతో హుటాహుటిన సిబ్బందితో కాలనీవాసులు, మీడియా మిత్రులు అందరూ కలిసి మంగళవారం రాత్రి ఏడు గంటల నుండి గాలింపు సుమారు 3 గంటలకు పైగా వెతుకులాట కొనసాగుతోంది. సుమారు 30 మంది యువకులు బైకులు, నడక ద్వారా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర గాలింపు చేపడుతున్నారు. కిడ్నాప్‌కు గురైన యువతిని కాపాడేందుకు పోలీసులు యువకులు చీకట్లో మొబైల్ ఫోన్ వెలుతురులో గాలిస్తున్నారు.