- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యం కోసం వాగు దాటించి…
by Sridhar Babu |
X
దిశ, మణుగూరు: కుండపోతగా కురిసిన వర్షానికి మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిత్యావసరాలు, వైద్యం కోసం గిరిజనులు వాగులు దాటక తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. గుండాల-నరసాపురం మధ్య మల్లన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది.
దీంతో నరసాపురం తండాకు చెందిన మాలోతు మౌనిక తన 45 రోజుల పాపకు టీకా వేయించేందుకు, స్థానికుల సాయంతో వాగు దాటి టీకా వేయించింది. ప్రమాదమని తెలిసినా.. అత్యవసర పరిస్థితులలో వాగు దాటడం తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మా బతుకులు ఎప్పుడు మారతాయో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Advertisement
Next Story