మస్కిటో చేపతో.. దోమలు ఖతం..?

by srinivas |
mosquito fish
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాలం వచ్చిందటే చాలు దోమల విజృంభన రోజురోజుకు పెరుగిపోతుంటుంది. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి రోగాలకు కారణమయ్యే దోమలను నియంత్రించడంలో ఈ మస్కిటో చేపలు (గాంబుసియా) ఉపయోగపడతాయి. దక్షిణ అమెరికాకు చెందినవి ఈ గంబూసియా చేపలు. దక్షిణ అమెరికాలో జ్వరాలకు కారణమయ్యే దోమలను హరించడానికి వీటిని ఉపయోగించారు. దీంతో ఉత్తమ ఫలితాలు రావడంతో వీటి వినియోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాడకంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయోగాత్మక కార్యక్రమం చేపట్టారు.

ఈ చేపలను ఉపయోగించి దోమలకు చెక్ పెట్టేందుకు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ కార్పోరేషన్ వారు. అదేలా అంటే… దోమల తమ సంతతిని పెంచుకోవడానికి లార్వాని ఉత్పత్తి చేస్తాయి. నీటి గుంటల్లో, కొలను లాంటి నీరు నిల్వ ఉండే చోట ఈ లార్వా, ప్యూపాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గంబూసియా చేపలను చెరువుల్లో, కొలనుల్లో, నీటి గుంటల్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని నీటి వనరులను అందుబాటులో ఉన్న చోటులో ఈ చేపల పెంపకాన్ని చేపడుతున్నట్లు, సుమారు లక్ష చేపల పెంపకమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారుల వెల్లడించారు.

Advertisement

Next Story