- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్స్ మళ్లీ బంద్.. తెరిచేది అప్పుడే..!
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నియోజకవర్గం, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నియోజకవర్గాలకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూంలో ఉన్నాయి. వీటి ఫలితాలను బుధవారం లెక్కించేందుకు అధికారులు ఇప్పటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలను పురస్కరించుకుని ప్రచారం ముగిసిన 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 14వ తేది వరకూ మద్యం షాపులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో 17వ తేది బుధవారం కౌంటింగ్, ఇదే రోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నందున రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు.