‘కుల రహిత సమాజం కోసం కృషి చేస్తా ’

by Shyam |
‘కుల రహిత సమాజం కోసం కృషి చేస్తా ’
X

దిశ, దుబ్బాక : దుబ్బాక నియోజకవర్గంలో కుల రహిత నిర్మూలనకు తమవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నియోజకవర్గంలోని ఏ కార్యక్రమం జరిగినా కుల, మతాలకు అతీతంగా జరుపుకోవాలని సూచించారు. సమసమాజ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఆశయాలను అందరం కొనసాగించాలని తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక గొప్ప మహనీయుడు అన్నారు. అంబేడ్కర్ ను ఒక కులవివక్ష గా చూడడం దారుణమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఇప్పుడు మనం దేశంలో ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అది అంబేడ్కర్ వల్లనే అని అన్నారు.

మనిషికి గుర్తింపు కులం తోటి కాదని, చదువుతోనే వస్తుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విదేశాలకు వెళ్లి పై చదువులు చదివి రాజ్యాంగ నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు పొందారని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed