- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల కంటే ముందు ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి వారిలో నింపాల్సి ఉందని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. అధికరణం 370ని పునరుద్ధరించే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోరని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ తర్వాతి రోజున ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 పునరుద్ధరించే దాకా ఎన్నికల్లో పోటీ చేయను. లేదంటే వారు నన్ను రాజకీయాలు చేస్తున్నారని అంటారు. కానీ, ప్రజాస్వామిక అంశాల్లో పార్టీ వెనుదిరగదు, ఇతరులు వాటిని హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరకోదు. ఎన్నికల్లో పాల్గొంటుంది. ఒకవేళ పార్టీనే గెలిస్తే చాలా మంది సీనియర్ లీడర్‌లు ఉన్నారు. కానీ, నేను ముఖ్యమంత్రిని కాబోను. 370 పునరుద్ధరణ నాకు కేవలం ఒక నినాదం కాదనే సందేశాన్ని నా ప్రజలకు పంపాలి’ అని వివరించారు. ‘ప్రతిపత్తిని తొలగించారు. రాష్ట్ర హోదాను తీసేశారు. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ప్రభుత్వంపై విశ్వాసం లేదు. వారిలో తిరిగి ఆత్మవిశ్వాసం నింపాలి. తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టిన తరుణంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానితో భేటీ నిర్ణయం తీసుకున్నదనే వాదనలున్నాయి. వీటిపై ఆమె స్పందిస్తూ ‘సాయుధులను చంపడం దళాలకు విజయమేమో కానీ, ప్రభుత్వానికి కాదు. అసలు యువత ఎందుకు గన్నులు పడుతున్నారని ఆలోచించాలి. ఓ సాయుధుడిని నీవు పూడ్చిపెడితే మిగతావారందరికీ అతడి దేహం పాకిస్తాన్‌ది అయిపోతుంది. ఆయన సమాధిపైన జెండా పాకిస్తాన్‌ది అవుతుంది. వీటన్నింటిని పరిశీలించాలి. ప్రజలకు చేరువవ్వాలి’ అని అన్నారు.