- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనం’
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన వేలాన్ని టెలికాం శాఖ 2021లో జనవరి-మార్చి మధ్య కాలంలో నిర్వహించవచ్చని దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఈ వేలంలో రిజర్వ్ ధర ఎక్కువగా ఉంటే గనక తాము ఈ వేలంలో పాల్గొనే పరిస్థితి లేదని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే స్పెక్ట్రమ్ వేలం కోసం కంపెనీ ఆలోచిస్తోందని, ప్రధానంగా గ్రామీణ, గృహ అవసరాల నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు 1,000 ఎంఏహెచ్ ఫ్రీక్విన్సీ కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఆయన వివరించారు.
టెలికాం నియంత్రణ సంస్థ ప్రకారం..5జీ సేవలకు 3,300 నుంచి 3,600 ఎంఏహెచ్ బ్యాండ్ సరైనదని, ఒక ఎంఏహెచ్ ధర రూ. 492 కోట్లుగా ట్రాయ్ సిఫార్సు చేస్తోంది. దీని ప్రకారం..5జీ స్పెక్ట్రమ్ కోసం ఒక కంపెనీ రూ. 50,000 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ వివరించింది. ఈ స్థాయిలో ఆర్థిక భారాన్ని భరించలేమని, 2జీ సేవల వినియోగం తగ్గిపోతున్న క్రమంలో 1,800 ఎంహెచ్‌జడ్ బ్యాండ్‌ను కొనుగోలు చేసేందుకు చూస్తున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. 4జీ సేవల వినియోగం కోసం 2,300 ఎంఏహెచ్ బ్యాండ్‌పై దృష్టి సారించినట్టు గోపాల్ తెలిపారు.