- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త రేషన్ కార్డులు వచ్చేనా?
దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న వేలాది మంది కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా కార్డులు జారీ కాకపోవడంతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు సైతం దూరమయ్యారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొంతమందికి పంపిణీ చేసి, ఆ తర్వాత కార్డుల జారీ నిలిపివేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విషయంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకోవడంతో లబ్ధిదారుల్లో ఉత్సాహం నెలకొంది.
సీఎం నిర్ణయంపై చిగురించిన ఆశలు
తెల్ల రేషన్ కార్డు కేవలం సరుకుల కోసమే కాకుండా.. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వర్తిస్తుంది. ప్రతి పనికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లింక్ చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక పాత కార్డుల స్థానంలో ఆహార భద్రత పేరుతో కొత్త వాటిని తీసుకువచ్చింది. కొంతమందికి మాత్రమే ఐదేళ్ల క్రితం వీటిని జారీ చేసినా.. ఇప్పటివరకు కొత్త వాటిని అమలు చేయలేదు . దీంతో ఐదేళ్లుగా కుటుంబాల నుంచి విడిపోయిన అర్హులైన లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. నిరుపేద కుటుంబాలు రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ బియ్యంని కోల్పోవడంతో పాటు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఏళ్లు గడుస్తున్నా కార్డులు మంజూరు కలగానే మిగిలిపోయింది. మంగళవారం లాక్ డౌన్ విషయమై సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడంపై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో లబ్ధిదారుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
ఏళ్లుగా నిరీక్షణ
గత ఐదేళ్ల క్రితం నూతన ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి కొత్త రేషన్ కార్డుల కోసం 17.271 దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులలో ముందుగా డిటి లాగిన్ లోకి వెళ్లి ఆ తర్వాత పౌరసరఫరాల శాఖ అధికారి లాగిన్ లో ఆమోదించిన తర్వాత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆమోదిస్తే కొత్త రేషన్ కార్డు జారీ అవుతుంది. కానీ ఈ దరఖాస్తును కేవలం పరిశీలనలోనే ఉండి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేక వెబ్‌సైట్ మూసివేసింది. దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు రాక, కొత్త వారు దరఖాస్తు చేసుకోలేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కేసీఆర్ నిర్ణయంపై కొంతమేరకు ఆశలు చిగురించినా.. నూతన రేషన్ కార్డులు వచ్చే వరకు సర్కారుపై నమ్మకం లేదంటున్నారు లబ్ధిదారులు.