- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంతో చర్చలకు సిద్ధమే.. కానీ: రాకేశ్ తికాయత్
న్యూఢిల్లీ: చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తామూ చర్చలకూ సిద్ధంగానే ఉన్నామని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ట్రాక్టర్ ర్యాలీ తర్వాత ప్రభుత్వం అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ముందుగా కల్పించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఒత్తిళ్లకు తాము తలొగ్గమని చెప్పారు. ప్రధానమంత్రి ప్రతిష్టను కాపాడుతామని, గౌరవిస్తామని, అదే సమయంలో రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కట్టుబడతామని తెలిపారు. ట్రాక్టర్ పరేడ్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలు కుట్రలో భాగంగానే చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఎర్రకోటపై సిక్కుల జెండాను ఎగరేయడాన్ని ఖండించారు. జాతీయ జెండాను అందరూ ప్రేమిస్తారని, గౌరవిస్తారని అన్నారు. జాతీయ జెండాను అవమానించడాన్ని ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. అందుకే లాల్ ఖిల్లాపై సిక్కుల జెండా ఎగరేసిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.