‘సీఎంకు ఉత్తరాంధ్రపై కాదు అక్కడి ఆస్తులపై ప్రేమ’.. టీడీపీ నేత గౌతు శిరీష

by srinivas |   ( Updated:2021-12-09 04:06:06.0  )
gouthu sirisha
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ రైల్వేజోన్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదో సీఎం చెప్పాలని టీడీపీ నేత గౌతు శిరీష డిమాండ్ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విశాఖ రైల్వే జోన్ ప్రైవేటీకరణపై పోరాడటం లేదని విమర్శించారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేజోన్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో డీపీఆర్‌ కూడా సిద్ధమైందని.. కానీ ఇప్పుడు జోన్‌ లేదని కేంద్రం అనడం బాధాకరమని ఆమె అన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం ఆ మాట నిలబెట్టుకోలేదని, ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించిందని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌లను అటకెక్కించిన కేంద్రపై వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదో ప్రజలకు వివరించాల్సిన ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిలు ఎందుకు పోరాటం చేయడం లేదో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు.

సీఎం జగన్, విజయసాయిరెడ్డిలకు ప్రేమ ఉత్తరాంధ్రపై కాదని.. సహజవనరులు, భూములు, ప్రభుత్వ ఆస్తులపైనేనంటూ గౌతు శిరీష ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు, సీఎం జగన్ పోరాటం చేయకపోతే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Next Story