- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మెగా కోడలుకు డబ్ల్యూహెచ్ఓ కితాబు
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడ్‌నోమ్ ఘెబ్రెయెసుస్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. వరల్డ్ హెల్త్ డే రోజున ‘థాంక్స్ హెల్త్ హీరోస్ చాలెంజ్’ను స్వీకరించిన ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ 19 విజృంభిస్తున్న తరుణంలో తను చేస్తున్న సేవలను అభినందించారు. మీరు చెప్పినట్లుగానే వైద్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది మనల్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచేందుకు కోవిడ్ 19 వ్యాధితో పోరాడుతున్నారని… వారి త్యాగాలకు నేను కూడా ఎంతో కృతజ్ఞుడినని తెలిపారు.
My gratitude to @upasanakonidela for joining our #ThanksHealthHeroes challenge from 🇮🇳 this #WorldHealthDay. I too am thankful to all the doctors, nurses & frontline staff fighting #COVID19 & making sacrifices to keep us healthy & safe. Together!https://t.co/VDVB12Fwl0
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) April 7, 2020
ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వైద్య సిబ్బందికి డెడికేట్ చేస్తూ ట్వీట్ చేసింది ఉపాసన. మెడికల్ అట్మాస్పియర్‌లో పెరిగిన తనకు ఇలాంటి సమయాల్లో ఎన్ని ఇబ్బందులుంటాయో తెలుసని… కానీ వాటన్నింటిని అధిగమిస్తూ.. వారి ప్రాణాలను లెక్కచేయకుండా మనకోసం కోవిడ్ 19తో పోరాడుతూ వైద్యులు, నర్సులు పనిచేస్తున్నారని తెలిపింది. వారి త్యాగాలను గుర్తించి .. ఇంట్లోనే ఉంటూ, సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కృతజ్ఞతలు తెలపాలని కోరారు. మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో… ఫేక్ న్యూస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్త పడడం అంతే ముఖ్యమన్నారు. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రశంసపై ధన్యవాదాలు తెలిపిన ఉపాసన… గౌరవంగా స్వీకరిస్తున్నానని చెప్పింది.
ఇంతకు ముందే నిరుపేద కూలీలందరికీ అపోలో ఫార్మసీలో ఉచిత మందులు సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన ఉపాసనను చిరు కూడా ప్రశంసించారు. ఉపాసనది అద్భుతమైన మనసు అంటూ కొనియాడారు.
Tags: Upasana Konidela, Upasana, WHO, Corona, CoronaVirus, Covid 19