- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియా మ్యాపుపై డబ్ల్యూహెచ్ఓ కొత్త వివాదం
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్త వివాదానికి తెర తీసింది. కరోనా వైరస్ మహమ్మారి వివరాలను ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అన్ని దేశాల మ్యాపులతో సహా కరోనా కేసులు, మరణాల వివరాలు ఉంటాయి. ఇక్కడే భారత్ విషయంలో కొత్త సమస్యను సృష్టించింది. ఈ వెబ్‌సైట్‌లో ఉంచిన ఇండియా మ్యాపులో జమ్ముకశ్మీర్, అక్సాయిచిన్, అరుణాచల్‌ప్రదేశాలను అంతర్భాగంగా చూపించలేదు. వాటిని వివాదాస్పద భూభాగాలు అన్నట్లు పేర్కొంది. భారత్, పాకిస్థాన్ మధ్య 70 ఏండ్లుగా కశ్మీర్ వివాదం నడుస్తోంది. దీనిపై ఇరుదేశాలు ఐక్యరాజ్యసమితిలో పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. కశ్మీర్ తన భూభాగమని పాకిస్థాన్ పేర్కొంటుండగా ఆ విషయాన్ని భారత్ అంగీకరించడం లేదు. అంతేకాకుండా అన్ని అంతర్జాతీయ వేదికలపైన కశ్మీర్ తన అంతర్భాగంగా ఘంటా పథంగా చెబుతూ వస్తోంది. మూడోపక్షం జోక్యాన్ని కూడా అంగీకరించమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్న మ్యాపు ఆశ్చర్యానికి గురిచేసింది. వివాదం నడుస్తోంది కశ్మీర్‌పైనే. కాగా, డబ్ల్యూహెచ్ఓ పెట్టిన మ్యాపులో జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా వివాదాస్పద భూభాగాలుగా మార్కింగ్ చేయడం విస్మయం కలిగిస్తోంది. పాకిస్థాన్ ముద్రించే మ్యాపులో మినహా అన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలు జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా పేర్కొంటున్నాయి. కానీ, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే డబ్ల్యూహెచ్ఓ మాత్రం అలా చూపించడం వివాదాస్పదం అవుతోంది.
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో చైనాకు డబ్ల్యూహెచ్ఓ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాతో సహా చాలా దేశాలు ఆ సంస్థ వైపు వేళ్లు చూపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మన దేశ భూభాగాలైన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంతోపాటు అక్సాయిచిన్ ప్రాంతాలను డబ్ల్యూహెచ్ఓ వివాదాస్పద భూభాగాలుగా పేర్కొనడం గమనార్హం. ఈ చర్య కూడా డ్రాగన్ దేశానికి అనుకూలంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 1962 యుద్ధ సమయంలో అక్సాయిచిన్‌ను చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ఆ భూభాగం ఆ దేశం ఆధీనంలోనే ఉంది. అక్కడితో ఆగని చైనా అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం కూడా తనదే అంటూ వస్తోంది. ఈ అంశాన్ని యూఎన్ఓ దృష్టికి చైనా కానీ, భారత్ కానీ తీసుకెళ్లలేదు. అయినా డబ్ల్యూహెచ్ఓ వివాదాస్ప భూభాగాలు పేర్కొనడం గమనార్హం. జమ్ముకశ్మీర్, అక్సాయిచిన్, అరుణాచల్ ప్రదేశ్‌లను డబ్ల్యూహెచ్ఓ వివాదాస్పద భూభాగాలుగా చూపించడం అంటే ఐక్యారాజ్య సమితి చెప్పినట్టే లెక్క. ఈ అంశంపై భారత్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.
Tags: corona cases, WHO, new issue, up on jammu kashmir, arunachal pradesh,map display disputed land