- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టిక్‌టాక్‌లో ‘హూ’
దిశ, వెబ్‌డెస్క్:
టిక్ టాక్ అనేది ఒక ఎంటర్‌టైన్‌మైంట్ సోషల్ మీడియా యాప్. ఇందులో పాటలు, వీడియోలు, యాక్టింగ్ బిట్స్, ఫన్నీ వీడియోలు పోస్టు చేసుకోవచ్చు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచంలో ఆరోగ్యపరంగా అన్ని దేశాల బాగోగులు చూసుకునే సంస్థ. మరి టిక్ టాక్‌కి, ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఏ విషయంలోనూ పొంతన లేదు. కానీ డబ్ల్యూహెచ్ఓ వారు టిక్ టాక్‌లో ఖాతా తెరిచారు. ఎందుకు?
ముందు ప్రస్తావించినట్లే ప్రపంచంలో అన్ని దేశాల బాగోగులు చూసుకునే ప్రయత్నంలో ఏం చేయడానికైనా డబ్ల్యూహెచ్ఓ సిద్ధంగా ఉంటుంది. టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. వీడియోలు వైరల్ అవడానికి సరైన ప్లాట్‌ఫాం. అందుకే ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వ్యాప్తిని తగ్గించే క్రమంలో అవగాహన కల్పించడానికి డబ్ల్యూహెచ్ఓ, టిక్ టాక్ సోషల్ మీడియా యాప్‌ను వారధిగా ఎంచుకుంది. అందులో ఖాతా తెరవగానే మొదటి వీడియోలో కోవిడ్ 19 వ్యాప్తి అపాయాన్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది.
అలాగే మాస్క్ ఎలా ధరించాలి? వైరస్ సోకిందనే అనుమానం రాగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వీడియోలను కూడా పోస్టు చేసింది. వైరస్ లక్షణాలు కనిపించకపోతే మాస్కు ధరించాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం. టిక్ టాక్‌లో సాధారణంగా కనిపించే డాన్స్ వీడియోలు, కామెడీ వీడియోలతో పోలిస్తే ఇలాంటి అవగాహన వీడియోలకు తక్కువ స్పందన వస్తుందని అనుకోవచ్చు. కానీ ఆశ్చర్యం కలిగించేలా డబ్ల్యూహెచ్ఓ పోస్టు చేసిన మొదటి వీడియోకు 6.5 మిలియన్ వీక్షణలు వచ్చాయి.
అయితే ఒక ప్రపంచ స్థాయి సంస్థ టిక్ టాక్‌లో చేరడం ఇదే మొదటిసారి కాదు. ద రెడ్ క్రాస్, యునిసెఫ్‌లు కూడా టిక్ టాక్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి. టిక్ టాక్‌లో కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం ఎక్కువగా వైరల్ అవుతోందని తెలిసి డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి స్పందించిన టిక్ టాక్ యాజమాన్యం.. విశ్వసనీయ అధికారిక సమాచారాన్ని ఇవ్వగలిగే సంస్థలు తమ యాప్‌లో చేరడం ద్వారా తప్పుడు సమాచారాన్ని నియంత్రించే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలిపింది.
Tags – Tik Tok, WHO, World Health Organisation, Corona, COVID 19,