మూడేళ్ల కూతురిని నేలకేసి బాదిన తండ్రి.. దంపతులు అరెస్టు

by Sumithra |
మూడేళ్ల కూతురిని నేలకేసి బాదిన తండ్రి.. దంపతులు అరెస్టు
X

దిశ, మెదక్ : మెదక్ మున్సిపాలిటిలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు హౌసింగ్ బోర్డు కాలనీలో తన రెండవ భార్యతో కలసి నివాసం ఉంటున్నాడు. నాగరాజుకు గతంలో ఓ మహిళతో పెళ్ళి జరిగింది. మొదటి భార్యకు 3 మూడేళ్ల కూతురు ఉంది. అయితే, మద్యం తాగి వచ్చిన తండ్రి నాగరాజు మత్తులో ఆ చిన్నారిని తన రెండో భార్య ఎదుట విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా నేలకేసి బాదాడు.

ఈ దారుణాన్ని పక్కింటివారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన పోలీసులు బాలిక తండ్రి నాగరాజు, ఆయన రెండో భార్యను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. మున్సిపల్‌లో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఉద్యోగం నుంచి తొలగించినట్టు చైర్మన్ చంద్రపాల్ తెలిపారు. కాగా, మొదటి భార్యతో నాగరాజు ప్రతిరోజూ గొడవ పడటంతో పాపను తండ్రి వద్దనే వదిలేసి తల్లి పుట్టింటికి వెళ్లిపోయిందని కాలనీవాసులు చెబుతున్నారు.

Advertisement

Next Story