- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో బెస్ట్ ఎయిర్ క్వాలిటీ.. ఆ నగరాల్లో మాత్రమే!
దిశ, ఫీచర్స్ : దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాక్టరీలు, వాహనాల ఉద్గారాలకు తోడు పంటల వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రేరేపించాయి. ఈ నేపథ్యంలోనే కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను వీకెండ్స్ లాక్‌డౌన్ విధించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కల్పించేందుకు ఢిల్లీ సర్కార్ సమాయత్తమవుతోంది.
ఇదిలా ఉంటే, ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రామ్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ సర్వీస్(IQ Air service) పలు నగరాల్లోని గాలి నాణ్యతను పరీక్షించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా అధ్వాన్న AQI సూచికలు గల నగరాల జాబితాలో ఇండియా నుంచి మూడు నగరాలు ఉండటం గమనార్హం.
ఐక్యూ ఎయిర్ సర్వీస్ విడుదల చేసిన పూర్ ఎయిర్ క్వాలిటీ సిటీస్ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. మొత్తం నగరాల్లో కోల్‌కతా నాలుగు, ముంబై ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో లాహోర్(పాకిస్తాన్), చెంగ్డూ(చైనా) కూడా ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం ఎన్నో భారతీయ నగరాలు స్వచ్ఛమైన గాలి కోసం కష్టపడుతుండగా కొన్ని సిటీలు మాత్రం అత్యుత్తమ గాలి నాణ్యతను నమోదు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.. కర్ణాటక నుంచి మైసూర్, హుబ్బలి, చిక్‌బల్లాపూర్, దేవనగెరె, శివమొగ్గ, చమరాజనగర్.. కేరళ నుంచి ఎర్నాకులం, తిరువనంతపురం, కన్నూర్, కొల్లం వంటి నగరాలు సహా మిజోరాం(ఐజ్వాల్), కోయంబత్తూర్(తమిళనాడు), బ్రజ్రానగర్ (ఒడిషా), పుదుచ్చేరి వంటి సిటీలు కూడా ఉత్తమ గాలి నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నాయి.