- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్టర్ ప్రేమ ఎక్కడికి దారి తీసింది..?
దిశ, వెబ్‌డెస్క్ : అతడు ఓ కాంట్రాక్టర్. సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. వివాహమై ఓ కూతరు ఉంది. సాఫీగా సాగుతున్న అతడి సంసారంలో చిచ్చురేగింది. అతడి మదిలో పుట్టిన దుర్భుద్ది రెండు కుటుంబాలను బజారున పడేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే..
లోకేష్‌ది కర్ణాటక రాష్ట్రం, మండ్య జిల్లాలోని హొంబలే గ్రామం. జిల్లాలో మంచి పేరు మోసిన కాంట్రాక్టర్. యుక్త వయస్కుడైన లోకేష్‌కు మైసూర్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న అమూల్యతో ఓ కార్యక్రమంలో పరిచయం ఏర్పడింది. ఆమెతో చాటింగులు, ఫోన్ సంభాషనలు ప్రారంభించిన లోకేష్.. తనకు పెళ్లై, కూతురు ఉన్న విషయాన్ని దాచి ఆమెతో ప్రేమలో పడ్డాడు. అమూల్యతో చెట్టాపట్టాల్ వేసుకోని తిరిగాడు.
గాఢంగా ప్రేమించిన అమూల్య.. పెళ్లి చేసుకోవాలని లోకేష్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ప్రేమమైకం నుంచి తేరుకున్న లోకేష్.. భవిష్యత్తును తలుచుకోని భయపడ్డాడు. తన స్టేటస్, భార్య, కూతురు గుర్తుకు వచ్చింది. వీటన్నీటికి పరిష్కారంగా ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. పెళ్లి విషయం మాట్లాడుదామని అమూల్యను మైసూరులోని ఓ హోటల్‌కు పిలిచి, ఆమెను హత్య చేశాడు. అనంతరం భయపడి విషయాన్ని తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతడు పోలీసులను తీసుకోని వచ్చే సరికి లోకేష్ సైతం ఆత్యహత్య చేసుకున్నాడు. లోకేష్ అనాలోచిత నిర్ణయం వల్ల భార్య, కూతురుతోపాటు అమూల్య జీవితం కూడా అంథకారం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.