- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ ఎప్పుడు జనించింది?
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ గమ్‘మత్తు’(గమ్మత్తు) అయినది. జీవితానికి పరమార్థమిదే అని కొందరు సెలవిస్తే.. జీవితకాలం అనుభవించాల్సి వచ్చిన శాపమని ఇంకొందరు(ప్రేమ విఫలమైనవారు!) ప్రబోధించవచ్చు. కొన్నిసార్లు.. కొందరు ప్రేమలో అసాధారణంగా బిహేవ్ చేస్తారు. తెలివిగలవాళ్లు బుద్ధిహీనులుగా కొన్నిసార్లు విపరీతంగా ప్రవర్తిస్తారు. ప్రేమతో ప్రేమికులతోపాటు వారి కుటుంబాలూ బాధపడొచ్చు. లేదా గగనపుటంచుల్లో విహరించనూ వచ్చు. సరే, ప్రేమ పరిణామాలేలా ఉన్నా? మనిషి మరో మనిషితో కలిసి జీవించేందుకు, కనీసం కలిసి ఉండేందుకు ఇష్టపడతాడు. మనల్ని కలిపి ఉంచే బంధం అంతర్లీనంగా అందరిలోనూ ఉంటుంది.
ఏదో ఒక అనుబంధంతో మనం ఒకరితో ఇంకొకరం ముడిపడి ఉంటుంటాం. మరి ఈ ప్రేమ, ఈ అనుబంధం ఎలా అభివృద్ధి చెందింది? మనతోపాటు సమాంతరంగా వృద్ధి చెందిందా? ఒకరిద్దరికో పరిమితమైనది కాదు.. అందరిలోనూ ఈ గుణముంది కదా. కేవలం మనిషిలోనే కాదు.. ఇతర క్షీరదాల్లో(క్షీరదాల నుంచే మనిషి ఉద్భవించాడు)నూ ప్రేమ కనిపిస్తుంది. అంటే క్షీరదాల పరిణామ క్రమంలోనే ప్రేమ అంతర్భాగంగా ఉంటూ వృద్ధి చెందిందా? అంటే.. ఔననే కొన్ని విశ్లేషణలున్నాయి. పరిణామక్రమంలోనే జీవులు ప్రేమను అందిపుచ్చుకున్నాయని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. సహజ ప్రవృత్తికితోడు ప్రేమను అభివృద్ధి చేసుకున్నాయని వివరిస్తున్నాయి. మనకు అందుబాటులో ఉన్న కొన్ని శిలాజాలను పరిశీలిస్తే.. ఈ విషయం బోధపడుతుంది. ఈ ప్రేమే డైనోసార్ల కాలంలోనూ పూర్వపు క్షీరదాల(పాలిచ్చే జంతువులు) కాపాడగలిగిందన్న ఆసక్తికరమైన విషయమూ అర్థమవుతుంది.
అమ్మ ప్రేమ.. అన్నింటికి మూలం :
ప్రేమ అంటే.. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, ప్రేయసి/ ప్రియుల ప్రేమ, సోదరీ సోదరుల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఇలా చాలా రకాలు గుర్తొస్తాయి. నిజమే.. కానీ, ఇన్ని ప్రేమలు లేదా అనుబంధాలు, ఆప్యాయతలు ఉన్నా.. అమ్మ ప్రేమ మాత్రం యూనివర్సల్. అంటే లోకమంతటా అని కాదు.. ఇతర జీవజాతుల్లోనూ మనం పరిశీలించవచ్చు. దీని ద్వారా క్షీరదాల్లోనూ మొదటగా జనించింది తల్లి ప్రేమ అని చూచాయగా ఓ అభిప్రాయానికి రావొచ్చు. కొన్ని ఆధారాలు, జీవం పుట్టుక గురించి చర్చిస్తే ఇంకాస్త స్పష్టత ఏర్పడుతుంది.
దాదాపు రెండు 20 కోట్ల సంవత్సరాలకు పూర్వమే(ట్రయాసిక్ పీరియడ్ చివరల్లో.. జురాసిక్ పీరియడ్ తొలికాలంలో) అమ్మ ప్రేమకు సంబంధించిన ఆధారాలున్నాయి. ఇందులో ప్రస్తుత అమెరికా రాష్ట్రం అరిజోనాలో సంచరించిన జురాసిక్ ప్రొటొ మామ్మల్(క్షీరదం).. కయెంటథీరియం జీవి శిలాజం ముఖ్యమైంది. 38 చిట్టి తన సంతానాన్ని కాపాడుతూ చనిపోయినట్టున్న ఆ శిలాజం దాదాపు 20 కోట్ల సంవత్సరాలకు పూర్వమే తల్లి ప్రేమ ఉన్నట్టు వివరిస్తున్నది.
సహజ ప్రవృత్తులు భయం, ఆకలి, మోహం లాంటివాటితోపాటు వాత్సల్యాన్నీ ఈ కయెంటథీరియం జీవి అభివృద్ధి చేసుకున్నదని తెలుస్తున్నది. అంటే, తల్లి ప్రేమ అంతకు ముందే అభివృద్ధి చెంది ఉన్నదని అర్థమవుతుంది. వాస్తవానికి తొలిదశ జీవులు ఉదాహరణకు బల్లిజాతి జీవులు సంతానంపై ఎటువంటి ఆసక్తిని ప్రదర్శించలేదు. కొమొడొ డ్రాగన్.. గుడ్లు పెట్టి వాటి మానాన వాటిని వదిలిపెడుతుంది. గుడ్లలో నుంచి వచ్చిన సంతానం ఒకవేళ ఇతర జీవుల ప్రమాదం నుంచి బయటపడినా.. తల్లి కంట కనపడితే మింగేస్తుంది. అందుకే తల్లి కనబడగానే మనుగడ కోసం దాని సంతానం పారిపోతుంది.
గుడ్లను పొదగాలంటే కూడా సంతానంపై తల్లికి ప్రేమ ఉండాలి. సంతానానికీ తల్లిపై నమ్మకం, ప్రేమ ఉండి భద్రతను కోరుకునేందుకు సిద్ధమై ఉండాలి. కానీ, కొరియెంటథీరియం ఈ గుణాలను అప్పటికే అభివృద్ధి చేసుకున్నది. ట్రయాసిక్ పీరియడ్‌కు సంబంధించిన రాళ్లల్లో మనకు తల్లి ప్రేమకు సంబంధించిన మరింత దృఢమైన ఆధారాలు లభిస్తున్నాయి. బల్లిజాతులు, షార్క్స్‌లకు భిన్నంగా ఈ కాలానికి చెందిన ప్రొటొ మామ్మల్.. మార్గనుకోడొన్ జీవి.. జీవితకాలంలో అనేకసార్లు దంతాలు కోల్పోకుండా ఒక క్రమంలో దంతాలు కోల్పోవడాన్ని అభివృద్ధి చేసుకున్నది. దంతాలు లేకుండా పుట్టి.. పాల దంతాలు అటుతర్వాత అవిపోయి మళ్లీ శాశ్వత దంతాలను కలిగే పద్ధతిని వృద్ధి చేసుకున్నది. పాలు తాగే కాలంలో సంతానానికి దంతాలు అవసరం లేదు. అప్పుడు సంతాన భద్రత, ఆహారాన్ని అందించడంలాంటివన్ని తల్లి మార్గనుకకోడొన్ చూసుకునేది. ఈ క్రమ వృద్ధిలోనే తల్లిపై సంతానానికి, సంతానంపై తల్లికి బలమైన అనుబంధం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇక్కడే మన పూర్వీకులైన క్షీరదాలు సహజ ప్రవృత్తులతోపాటు ప్రేమను అభివృద్ధి చేసుకున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఈ ప్రేమతోనే రక్షణ పొందడం, ఆశించడం జరిగినట్టు తెలుస్తున్నది. ఇలా క్షీరదాలు రిలేషన్‌షిప్స్ ఏర్పాటు చేసుకునే గుణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. మనుగడకు సంబంధించిన హింస, ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సహకరించుకునే పద్ధతినీ అవలంభించాయి. తల్లి ప్రేమ.. సహకారంతోనే జంతువుల సమూహాలు సాధ్యమయ్యాయి. ఏనుగులు, కోతులు, కుక్కల గుంపులు, మానవ తెగలుగా సంచరించే, లేదా జీవించేస్థితికి ప్రేమ కీలకంగా ఉన్నది. మానవ సమాజ ఏర్పాటుకు ప్రేమనే మూలం. ప్రేమవ్యాపిస్తూ ఉంటుంది. క్షీరదాల్లోనే కాదు.. పక్షులు, చీమలు, తేనెటీగలు, పురుగుల్లాంటి కీటకాలు సహా ఇతర జీవుల్లోనూ సంతానంపై ప్రేమ కనిపిస్తుంది.
రొమాంటిక్ లవ్ అనేది అంత పురాతనమైనదేం కాదు. క్షీరదాల్లో వాస్తవానికి సంతానాన్ని తల్లే కాపాడుకుంటూ వచ్చేది. సంతానాన్ని పెంచడంలో తల్లికి తండ్రి సహకరించే ఈ రొమాంటిక్ లవ్ మనిషి పూర్వీకుడు చింపాంజీల్లోనూ పెద్దగా లేదు. ఎలుకలను పోలి ఉండే బీవర్స్, వోల్స్, తోడేళ్లు, కొన్ని గబ్బిలాలు, హోమో సేపియన్స్‌లవంటి కొన్ని జాతుల్లోనే రొమాంటిక్ లవ్ ఉంది. నియాండర్తల్ నుంచి మనిషి పరిణమించడానికి కొంతకాలం ముందే ఈ తండ్రి ప్రేమ పుట్టి ఉండొచ్చని అభిప్రాయాలున్నాయి.
Read also..