- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్..

దిశ, జగిత్యాల టౌన్: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి టీడీపీలో మంత్రి, ఎమ్మెల్యే పదవికి,పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని అన్నారు. తాను కూడా తన మున్సిపల్ చైర్మన్ పదవికి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బిజెపి పార్టీలో గౌరవప్రదంగా చేరానని గుర్తు చేసారు. దొంగ రాత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మండిపడ్డారు. మిమ్మల్ని గెలిపించిన నాయకులు జైలులో ఉన్న వాళ్ళను మర్చిపోయి బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మీరు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టావని అన్నారు. జగిత్యాల లో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యమని తెలిపారు. 2017లో భూమి పూజ చేసిన డబుల్ ఇండ్లు పూర్తిస్థాయిలో ఇప్పటివరకు పూర్తికాలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో4 వేల నుండి 43 వేల ఓట్లు వచ్చిన నాకు మా కార్యకర్తల కష్టం పార్టీ సపోర్ట్ ప్రజలు దీవించి ఇచ్చిన గౌరవప్రదమైన తీర్పని తెలిపారు. రాబోయే కాలంలో జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ కొక్కు గంగాధర్, సెక్రటరీ రాజన్న, కళావతి,మమత,పవన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.