ఊసరవెల్లి.. నువ్వంటే నువ్వు.. లైవ్‌లో రాయుడు, నవజ్యోత్ సిద్ధూ మధ్య వాగ్వాదం

by Harish |
ఊసరవెల్లి.. నువ్వంటే నువ్వు.. లైవ్‌లో రాయుడు, నవజ్యోత్ సిద్ధూ మధ్య వాగ్వాదం
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్లు అంబటి రాయుడు, నవజ్యోత్ సింగ్ సిద్దూ లైవ్‌లో పరస్పరం మాటల యుద్ధానికి దిగడం చర్చనీయాంశమైంది. ఐపీఎల్-18లో భాగంగా మంగళవారం జరిగిన చెన్నయ్ సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కు వీరిద్దరూ కామెంటేటర్లుగా వ్యవహరించారు. మ్యాచ్ గురించి చర్చ జరుగుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాచ్ గురించి చర్చ జరుగుతుండగా ‘ఊసరవెల్లి.. నువ్వంటే నువ్వు’ అని అనుకున్నారు. ముందుగా రాయుడే నోరు పారేసుకున్నాడు. ‘సిద్దూ జట్లను ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలాగా మారుస్తాడు’అని రాయుడు కామెంట్ చేశాడు. దీనికి నవజ్యోత్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ‘నువ్వు మాట్లాడుతున్నది తప్పు. ఈ ప్రపంచంలో ఊసరవెల్లికి ప్రతిరూపంగా ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరూ నవ్వుకుంటూనే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిగ్గజ క్రికెటర్లు అయి ఉండి ఇలా నోరుపారేసుకోవడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.




Next Story

Most Viewed