- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్ వాడే వారు ఇవి తప్పక తెలుసుకోవాలి..
దిశ, వెబ్‌డెస్క్ : వాట్సాప్ వినియోగించని వారంటూ ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తూనే ఉంటారు. ఇక కరోనా కారణంగా చాలా మంది వర్కఫ్రం హోంకే పరిమితమయ్యారు. దీని వలన వారు వాట్సాప్‌నే ఎక్కువగా వాడుతున్నారు. ఏ చిన్న సమాచారం ఉన్న ఆఫీసు వారు వాట్సాప్‌లోనే పంపుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆఫీసు నుంచి వచ్చే మెసెజ్‌లను ప్రతీసారి ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. అయితే అలాకాకుండా ముఖ్యమైన సందేశం వస్తేనే చూసుకోవడానికి నోటిఫికేషన్ అలర్ట్‌ను పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. మనకు వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూస్తుంటాము. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూసినట్లు తెలిసిపోతుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడకుండా ఉండేలా కూడా చేయవచ్చు. ctrl+alt+shift+u క్లిక్ చేస్తే అన్‌రీడ్ మోడ్‌లోకి మారిపోతుంది. అంతే కాకుండా న్యూ గ్రూప్ క్రియేట్ చేసుకునేందుకు కూడా షార్ట్ కట్ ఆఫ్షన్ ఉంది. దీనికోసం ctrl+alt+shift+N క్లిక్ చేయాలి. ఇక న్యూ చాట్ కోసం ctrl+alt+N ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
ఇక కొంత మంది తమకు నచ్చిన వారి ఫ్రోఫైల్ ఎబౌట్ చూస్తూ ఉంటారు. అయితే ప్రతీసారీ వారి చాట్‌లోకి వెళ్లి ఎబౌట్ ప్రోఫైల్ చూడలేము కదా.. దాని కోసం యూజర్ ప్రొఫైల్ అండ్ ఎబౌట్ సెక్షన్‌కు వెళ్లేందుకు సింపుల్‌గా ctrl+alt+P క్లిక్ చేస్తే సరిపోతుంది. గ్రూప్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేయాలంటే సింపుల్. ctrl+alt+shift+M ప్రెస్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్ గ్రూపుల్లోని చాటింగ్ సెక్షన్‌లో సెర్చ్ చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. చాటింగ్ సెక్షన్ కోసం ctrl+alt+shift+f క్లిక్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్ సెట్టింగ్‌లోకి వెళ్లాలంటే ఏవేవో నొక్కాల్సిన అవసరం లేదు. ముందుగా మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమి ఉండకుండా డైరెక్ట్‌గా వెళ్లాలంటే ctrl+alt+, క్లిక్ చేస్తే సరిపోతుంది. ఏదైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే సాధారణంగా గ్రూప్‌లోని మూడు చుక్కలపై క్లిక్ చేసి ఎగ్జిట్ గ్రూప్ ఆప్షన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరిపోతుంది. వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను క్లియర్ చేసుకోవడానికి దీనిని వాడుకోవచ్చు.