- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ఎలాంటి పవర్ బ్యాంక్‌ను కొంటున్నారు..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సెల్ ఫోన్ శరీరంలో ఓ పార్ట్ అయిపోయింది. ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్యోగులు, బిజినెస్ పనుల మీద టూర్లు తిరిగేవారికి ఫోన్‌ను ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి వారికి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఓ సమస్యగా మారుతుంది. ప్రయాణంలో ఉన్న సమయంలో ఛార్జింగ్ పెట్టుకోవడం ఇబ్బందే. అలాంటి వారు పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే ఎలాంటి పవర్ బ్యాంక్ కొనుగోలు చేయలో ముందే తెలుసుకుంటే బెటర్.
ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్‌ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా..? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది..? అన్న వివరాలు తెలుస్తాయి. పవర్ బ్యాంక్ పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. పవర్ బ్యాంక్ కొనేముందు ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్ ఫోన్ కు ఎంత ఫాస్ట్ గా ఛార్జింగ్ అవుతుందో చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల మన్నికతో ఉంటుంది. రెగ్యులర్ గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సి ఉంటుంది. ధర కాస్త ఎక్కువైనా కంపెనీ పవర్ బ్యాంక్ కొనడం మేలు.