పూల్‌డ్ టెస్టింగ్ అంటే ఏమిటి?

by sudharani |
పూల్‌డ్ టెస్టింగ్ అంటే ఏమిటి?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచే ఉద్దేశంతో కొవిడ్ 19 పరీక్షల కోసం పూల్‌డ్ శాంపిల్స్ టెస్టింగ్ ఉపయోగించాలని సోమవారం రోజున ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాలు సలహా ఇచ్చింది. మరి ఈ పూల్‌డ్ టెస్టింగ్ (Pooled Testing) అంటే ఏమిటి?

ఈ పూల్‌డ్ టెస్టింగ్‌ అల్గారిథంలో వివిధ వ్యక్తుల శాంపిల్స్ అన్ని ఒక దగ్గర పెట్టి, అన్నింటికీ ఒకేసారి పీసీఆర్ పరీక్ష చేస్తారు. ఈ పూల్‌డ్ టెస్టులో పాజిటివ్ వస్తే ఆ శాంపిల్స్ అన్నింటికీ వ్యక్తిగత టెస్టులు చేస్తారు. నెగెటివ్ వస్తే ఆ పూల్ వ్యక్తులందరినీ నెగెటివ్‌గా పరిగణించి వదిలేస్తారు. అంటే ఒక గుంపు మొత్తానికి పాజిటివ్ వస్తే.. ఒక్కొక్కరిగా టెస్ట్ చేయడం లేదంటే ఎవరికీ కరోనా లేదని స్పష్టం చేయడం చేస్తారన్నమాట. దీనివల్ల పెద్దమొత్తంలో ఖర్చు తగ్గడంతో పాటు పని కూడా తగ్గుతుంది.

అయితే ఈ పూల్ శాంపిల్స్‌లో ఇద్దరి కంటే ఎక్కువ, గరిష్టంగా ఐదుగురి శాంపిల్స్ మాత్రమే కలపాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఐదు కంటే ఎక్కువ శాంపిల్స్ కలిపితే తప్పుడు నెగెటివ్‌లు వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో అంటే నెగెటివ్ అని ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న హాట్‌స్పాట్లలో ఈ పూల్‌డ్ టెస్టింగ్ అనుకూలం. అంతేకాకుండా ఈ టెస్టింగ్ ద్వారా అసలైన కరోనా టెస్టు కిట్లను సద్వినియోగ పరుచుకునే అవకాశం కూడా కలుగుతుంది.

Tags: corona, covid, lockdown, pool testing, positive, negative, kits, cost effective, ICMR

Advertisement

Next Story