- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్క గెలుపుతో స్పాన్సర్ దొరికారు
దిశ, స్పోర్ట్స్: ఓడిపోతూ ఉంటే మనల్ని ఎవరూ పట్టించుకోరు. అదే ఒకసారి గెలిస్తే ఈగల్లా మన చుట్టే ఉంటారనే మాట వెస్టిండీస్ విషయంలో నిజమైంది. ఇంగ్లండ్ పర్యటనకు రావడానికి కనీసం డబ్బులు కూడా లేకుంటే అన్ని ఖర్చులు ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) భరించింది. సౌతాంప్టన్ టెస్టు ముందు వరకు ఇంగ్లండ్ జట్టే ఫేవరెట్. కానీ, అన్ని రంగాల్లో రాణించిన వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ విజయానందంలో ఉండగానే మరో శుభవార్త తెలిసింది. రెండు వారాల క్రితమే ‘కాస్టోర్’ కిట్ స్పాన్సర్‌గా మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ‘లైఫ్ బాయ్’ సంస్థ శానిటైజర్ స్పాన్సర్‌గా ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఇంగ్లండ్‌లో విండీస్ జట్టు పర్యటించినంత కాలం లైఫ్ బాయ్ భాగస్వామిగా ఉండనున్నది. ఈ డీల్ ఎంతకు కుదిరిందనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. ‘ఈ పర్యటనలో మాకు శానిటైజర్ స్పాన్సర్‌గా లైఫ్ బాయ్ ఉంటుంది. ఆటగాళ్లు, సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగకరం. భవిష్యత్‌లో మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది’ అని విండీస్ జట్టు కమర్షియల్ డైరెక్టర్ డోమినిక్ వార్న్ అన్నారు.