- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటికైనా గౌరవం ఇవ్వండి: బ్రావో
దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో జాతి వివక్షపై డారన్ సామి గళం విప్పడంతో అందరూ తాము ఎదుర్కొన్న ఘటనలను గుర్తు చేసుకున్నారు. క్రిస్ గేల్, ఇర్ఫాన్ పఠాన్‌లు తాము ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారో చెప్పారు. ఈ అంశంపై డ్వేన్ బ్రావో స్పందించాడు. ఇప్పటివరకూ జరిగిందేదో జరిగిపోయిందని, ఇక నుంచైనా తమకు గౌరవం ఇవ్వాలని ప్రపంచాన్ని కోరాడు. జింబాబ్వే క్రికెటర్ పొమ్మి ఎంబాగ్వాతో జరిపిన లైవ్ చాట్‌లో బ్రావో ఈ మాటలు అన్నాడు. ‘ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఓ నల్లజాతి వ్యక్తిగా నల్లజాతీయుల చరిత్ర నాకు తెలుసు. మేం ఏనాడూ ప్రతీకారం కోరలేదు. ఇప్పటికీ సమానత్వాన్నే కోరుకుంటున్నాం’ అని అన్నాడు. ‘మాకు సమానత్వం కావాలి. ఎలాంటి ప్రతీకారం, యుద్ధం వద్దు. కేవలం గౌరవమిస్తే చాలు. ఒకరినొకరం అప్యాయంగా పలకరించుకోవడం, ప్రేమను పంచుకోవడం కావాలి. అదే ముఖ్యం’ అని బ్రావో చెప్పుకొచ్చాడు.