వెస్ట్‌బెంగాల్‌లో మద్యం హోం డెలీవరీ అంటూ ఫేక్ న్యూస్

by Sujitha Rachapalli |   ( Updated:2020-04-09 05:33:59.0  )
వెస్ట్‌బెంగాల్‌లో మద్యం హోం డెలీవరీ అంటూ ఫేక్ న్యూస్
X

దిశ వెబ్ డెస్క్: లాక్‌డౌన్‌ కారణంగా దేశమంతా వైన్ షాపులన్నీ బంద్ అయ్యాయి. దాంతో మద్యపాన ప్రియులు మద్య దొరక్కపోవడంతో వింతవింతగా ప్రవర్తించారు. నానా అవస్థలు పడ్డారు. వాళ్లందరికీ మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందంటూ ఓ వార్త ఆన్ లైన్ బాగా వైరల్ అయ్యింది. లాక్‌డౌన్‌ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్‌ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ వర్గాల ద్వారా తెలిపినట్లు ఆ వార్త సర్క్యూలేట్ అవుతోంది.
పశ్చిమబెంగాల్ లో మద్యం ఆన్ లైన్ డెలీవరీకి మమతా బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి ఆధారం లేదు. ఆ వార్త వదంతని కోల్ కతా పోలీస్ చీఫ్ అనూజ్ శర్మ మీడియాకు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలోనే కాదు.. ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లలో కూడా బాగా సర్క్యూలేట్ అయ్యిందని, కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.

ఫేక్ వార్తలో ఏముందంటే..

లాక్ డౌన్ సమయంలో లిక్కర్ అమ్మకాలపై ఎటువంటి నిషేధం లేదని, వ్యాపారులు దుకాణాలు ఓపెన్ చేయడానికి కుదరకపోవడంతో లిక్కర్ ను హోం డెలివరీ చేసేందుకు అనుమతిచ్చామని ఆ రాష్ర్ట ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ స్వీట్‌ షాపులను కొన్ని గంటలపాటు తెరచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ వల్ల మూతపడ్డ మద్యం షాపులను తెరవబోమని బెంగాల్ ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో మాత్రం అందుబాటులో ఉంటుందని వారన్నారు. ఇందుకు గానూ వ్యాపారులు తమ ప్రాంతంలోని ఎక్సైజ్ శాఖ, స్థానిక పోలీసుల స్టేషన్‌లలో హోం డెలివరీకి సంబంధించిన అనుమతి పత్రాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక్క షాపుకు కేవలం మూడు డెలివరీ పాస్‌లు మంజూరు చేస్తామని తెలిపారు. ‘వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో వారి ఫోన్ల ద్వారా మద్యం కొనుగోలుకు ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

అయితే.. ఇలానే కేరళలో ఓ వ్యక్తి మందును హోం డెలీవరీ చేయగా.. పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. అంతేకాదు. 50 వేల జరిమానా కూడా విధించారు.

Tags: lockdown, liquor, wine, online order, west bengal, mamata banerjee, excise department

Advertisement

Next Story

Most Viewed