- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆపద సమయంలో అండగా ఉంటా'
దిశ, మేడ్చల్: ఆపద సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటానని టీఆర్ఎస్ మల్కాజగిరి పార్లమెంట్ ఇన్ చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రవలకోల్ గ్రామానికి చెందిన ఎస్. కె. ఇమామ్ అలీ ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇమామ్ అలీకి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం మంజూరైంది. ఆ లక్ష రూపాయల చెక్కును మర్రి రాజశేఖర్ రెడ్డి బాధితుడి కుటుంబానికి మంగళవారం అందచేశారు. ఈ సందర్భగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు మేలు జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రవలకోల్ టీఆర్ఎస్ నాయకులు హారత్ రెడ్డి, డి. ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ మహేంధర్, ఎంపీటీసీ గోపన్న వెంకటేష్, మాజీ సర్పంచ్ ఎం. వెంకటేశ్, వార్డ్ మెంబర్లు ఎస్. కె. షాబ్ర బేగం, టీఆర్ఎస్ మండల టీ ఆర్ ఎస్ వై అధ్యక్షుడు హారత్ రెడ్డి పాల్గొన్నారు.