- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ ఆఫర్..

దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆఫర్ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. మావోయిస్టులు కరోనా బారినపడి చనిపోకుండా జన జీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు కరోనాతో చనిపోయారు. వారు బయటకు వస్తే.. వారి ప్రాణాలు పోకుండా కాపాడుతామని అన్నారు. వారు వెంటనే సరెండర్ కావాలని విజ్ఞప్తి చేశారు.
కరోనాతో ఎవరూ చనిపోకుండా వారిని ఆసుపత్రుల్లో చేర్పించి సరైన చికిత్స అందస్తామని తెలిపారు. బయటకు వచ్చిన మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషణ్ కరోనాతోనే చనిపోయారని అన్నారు. అందుకే, వారితో పాటు సీనియర్ లీడర్ షిప్ చనిపోకుండా ఉండాలంటే మిగిలిన వారు జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మావోయిస్టుల కుటుంబ సభ్యులకు మనవి చేస్తున్నాం.. వారిని వెంటనే సంప్రదించి సరెండర్ అయ్యే విధంగా ప్రేరేపించాలని కోరారు.