- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రణాళిక ప్రకారం పంటల కొనుగోళ్లు
దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన ప్రతి గింజను ప్రణాళిక ప్రకారం కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు ష్టపోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లాలోని రేవల్లి, గోపాల్‌పేట, పెద్దమందడి, ఖిల్లాఘణపురం, వనపర్తి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు కొనుగోలు కేంద్రాలలో సామాజిక దూరం పాటించాలన్నారు. కూపన్ల ప్రకారమే రైతులు తమకు కేటాయించిన సమయానికి ధాన్యం తీసుకురావాలని సూచించారు. మొక్కజొన్న సేకరణకు రూ.3213 కోట్లు, వరి ధాన్యం సేకరణకు రూ.25 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
tags;Minister Niranjan reddy,starts,crop purchase center,Mahabubnagar