ఉత్సాహంగా సాగిన పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.. విక్టరీ కొట్టిన వారియర్ జట్టు

by Sridhar Babu |
ఉత్సాహంగా సాగిన పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.. విక్టరీ కొట్టిన వారియర్ జట్టు
X

దిశ‌, ఖ‌మ్మం : ఖమ్మం జిల్లా పోలీస్ టీముల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ శిక్షణా కేంద్రంలో గల మైదానంలో రాయల్ చాలెంజ్ టీమ్ మరియు వారియర్ టీమ్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ప్రారంభించారు. మొదటగా కోచ్ మతీన్ టాస్ వేసారు. టాస్ గెలిచిన రాయల్ చాలెంజ్ పోలీసు జట్టు మొదటగా బ్యాటింగ్‌కు దిగారు. సీపీ వారియర్ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ జట్టు నిర్ణీత 15 ఓవర్లకు 104 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వారియర్ జట్టు 10.2 ఓవర్లలో 105 పరుగులు చేయడంతో వారియర్ జట్టు విజయం సాధించింది. ఇరు జట్లు పోటాపోటీగా తలపడటంతో మ్యాచ్ ఆసక్తిని రేకెత్తించింది.

అనంతరం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పోలీస్ కమిషనర్ ట్రోఫీలు అందజేశారు. మైదానం నలుమూలలా కళాత్మక షాట్లతో అలరించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా వారియర్ జట్టు సభ్యుడు సీఐ సతీష్ నిలిచారు. బెస్ట్ బ్యాటింగ్ విభాగంలో సీఐ శ్రీనివాస్‌‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. నిత్యం బిజీగా ఉండే పోలీసులు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారన్నారు. పోలీసుల మధ్య మంచి కో ఆర్డినేషన్ ఉండటానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామని, ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, డీసీపీ ఎల్‌సీ. నాయక్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ కె. ప్రసాద్, అడిషనల్ డీసీపీ (ఏఆర్‌) కుమారస్వామి, ఏఎస్‌పీ స్నేహ మెహ్రా, ఏసీపీలు రామోజీ రమేష్ , అంజనేయులు, భస్వారెడ్డి, వేంకటేశ్, ప్రసన్న కుమార్, జహాంగీర్, రామానుజం, విజయబాబు, సంపత్ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Next Story