టీమ్‌ఇండియా స్వరూపాన్నే మార్చేసిన ధోనీ: వకార్

by Anukaran |   ( Updated:2020-07-06 09:35:47.0  )
టీమ్‌ఇండియా స్వరూపాన్నే మార్చేసిన ధోనీ: వకార్
X

దిశ, స్పోర్ట్స్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై పాకిస్తాన్ క్రికెటర్ వకార్ యూనిస్ ప్రశంసల జల్లు కురింపించాడు. ఒక సాధారణ పట్టణం నుంచి వచ్చిన ధోనీ భారత జట్టును రెండు ప్రపంచకప్ విజయాలు సాధించేలా తీర్చిదిద్దాడని ఆయన కొనియాడాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమ్‌ఇండియాను అత్యుత్తమంగా తీర్చిదిద్దగా, ఎంఎస్ ధోనీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి టీం స్వరూపాన్నే సమూలంగా మార్చేశాడని పేర్కొన్నాడు. తాజాగా వకార్ ట్విట్టర్‌లో జరిపిన సంభాషణలో టీమ్‌ఇండియా క్రికెట్ కెప్టెన్ల గురించి మాట్లాడుతూ ధోనీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘భారత క్రికెట్ జట్టు కొత్త ప్రయాణానికి గంగూలీ బీజం వేయగా, ధోనీ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. వీరిద్దరు వేసిన బాటలో ఇప్పుడు కోహ్లి జట్టును నడిపిస్తున్నాడు. ధోనీ ఎంత గొప్ప ఆటగాడో నేను మాటల్లో వర్ణించలేను. అతడు మంచి క్రికెటర్ మాత్రమే కాదని, పరిస్థితులను అర్థం చేసుకోగలిగే నాయకుడు. టీమ్‌ఇండియా వంటి జట్టును సుదీర్ఘకాలం నడిపించడం అంటే మామూలు విషయం కాదు’ అని వకార్ యూనిస్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Advertisement

Next Story