టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ‘వకార్’ మండిపాటు..

by Shyam |
టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ‘వకార్’ మండిపాటు..
X

క్రికెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహణ తీరుపై పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ మండిపడ్డాడు. ఇండియా – పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ లేకుండానే దాన్ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గా ఎలా వ్యవహరిస్తారని ఆయన ఐసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు దేశాల మధ్య టెస్ట్ క్రికెట్ జరిగే విషయంలో ఐసీసీ చొరవతీసుకోవాలని ఆయన కోరాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య క్రికెట్ జరగడం కష్టమే అయినా.. సాధ్యమయ్యే మార్గాలను అన్వేషించాలని వకార్ సూచించాడు.

కాగా, రెండేళ్ల పాటు సాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూల్స్ ప్రకారం.. భారత్, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరగకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. 8 టెస్ట్ క్రికెట్ దేశాల్లో కనీసం ఆరు జట్లతో మ్యాచ్‌లు ఆడితే.. టెస్ట్ పాయింట్లు లభిస్తాయి. 2019 ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ వచ్చే ఏడాది జూన్ 10 నుంచి 14 వరకు లార్డ్స్‌లో నిర్వహించనున్నారు. ఇండో-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో 2007 నుంచి ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహించని సంగతి తెలిసిందే.

Tags : World Test Championship, Waqar Younis, India Vs pak, ICC

Advertisement

Next Story

Most Viewed